ఈ క్రమంలోని ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కూడా టీమ్ అఫ్ ది టోర్నమెంట్ పేరుతో ఏకంగా ప్రపంచకప్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లను ఒక జట్టుగా మార్చి ఆ వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించడం వైరల్ గా మారిపోయింది. ఇందులో టీమిండియా నుంచి సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ తో పాటు బౌలర్ అర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇకపోతే ఇటీవలే వరల్డ్ కప్ కి ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ప్రపంచ కప్ లో బాగా రాణించిన 11మంది ఆటగాళ్ళను ఒక జట్టుగా ఎంపిక చేస్తూ ఆ వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఇలా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన డ్రీమ్ 11 జట్టులో అటు ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్లు ఉండగా ఇక సెమి ఫైనల్లో ఓడిపోయి ఇంటిదారి పట్టిన భారత జట్టు నుంచి ఇద్దరు రన్నరప్ గా నిలిచిన పాకిస్తాన్ తరపున ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఇక న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే బంగ్లాదేశ్ నుంచి ఒక్కో ఆటగాడిని క్రికెట్ ఆస్ట్రేలియా తమ డ్రీం ఎలెవన్ జట్టులో సెలెక్ట్ చేయడం గమనార్హం.
క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన ఆటగాళ్లు వీళ్లే :
జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, సామ్ కరన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రీది, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సికిందర్ రజా, గ్లెన్ ఫిలిప్స్, అన్రిచ్ నార్జ్ ఉన్నారు. ఈ టీమ్‌కి కెప్టెన్‌గా జోస్ బట్లర్ ను ఎంపిక చేసింది.