ఇక మరి కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఇలా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టి అక్కడ రాణించాలని భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దానికోసం మంతనాలు కూడా జరుపుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా మాత్రం తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కాదు తన భార్యను పాలిటిక్స్ లోకి ప్రవేశపెట్టి కాస్త కొత్తగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కి ఇటీవల బిజెపి తరఫునుంచి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయింది అన్న విషయం తెలిసిందే.
ఇక ఆమె రానున్న ఎన్నికల్లో ఆమె గెలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.. ఇది ఇలా ఉంటే ఇటీవలే రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు సోషల్ మీడియాలో ఊహించిన షాక్ తగిలింది. ఆమె నిర్వహించిన ఒక సోషల్ మీడియా ఒపీనియన్ పోల్లో వచ్చిన ఫలితాలు చూసి ఆమె అవ్వక్కయింది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది.. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహించింది రివాబా జడేజా. ఇక ఈ పోల్ పై ఎంతో మంది స్పందించగా పూర్తిగా ఆమెకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వచ్చాయి. దీంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది ఆమె. కాగా ఆమె జామ్ నగర్ లోని నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.