ఈ క్రమంలోనే టీం ఇండియాలో అవకాశం దక్కకపోయినప్పటికీ ఎలాంటి నిరాశ పడకుండా ఇంగ్లాండ్ కౌంటింగ్ ఛాంపియన్షిప్లో ఆడటానికి సిద్ధమయ్యాడు వాషింగ్టన్ సుందర్. ఈ క్రమంలోనే కౌంటి ఛాంపియన్షిప్ లో తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ భారత టి20 జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. సీనియర్లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కివిస్ తో జరిగే టి20 సిరీస్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.
ఈ క్రమంలోనే అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ఇక తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్ లో ఆడటం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో కౌంటి ఛాంపియన్షిప్ లో లంకా షైర్ తరఫున ఆడిన అనుభవం.. ఇక ఎన్సిఏ లో గడిపిన సమయం.. తనను తాను మరింత బాగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చాడు. ఒక రకంగా కొత్తగా తిరిగి వచ్చా.. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఆడటమే నా టార్గెట్. ఇక ఇప్పుడుమళ్లీ ఇండియా తరఫున ఆడేందుకు ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.