
దినేష్ కార్తీక్ కు తుది జట్టులో అవకాశం కల్పించిన టీమిండియా యాజమాన్యం రిషబ్ పంత్ ను పక్కన పెట్టేసింది. కానీ దినేష్ కార్తీక్ ఎందుకో ఆశించని స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో ఇక మళ్ళీ రిషబ్ పంత్ తుది జట్టులోకి తీసుకుంది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పంత్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతను ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు. అయితే ఇక ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపైనే అందరూ చూపు ఉంది అని చెప్పాలి.
కాగా యువ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రతిభ గురించి మాజీ ఆటగాడు ఉత్తప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ మ్యాచ్ విన్నర్ అని.. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడని ప్రశంసలు కురిపించాడు రాబిన్ ఉత్తప్ప. రానున్న 10 ఏళ్లలో టి20 క్రికెట్లో అతని హావా కొనసాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతన్ని మిడిల్ ఆర్డర్లో కాకుండా టాప్ ఆర్డర్లో ఆడిస్తే జట్టుకు మరింత లాభం ఉంటుంది అంటూ తెలిపాడు. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రిషబ్ పంత్ కు ఓపెనర్ గా అవకాశం దొరికే ఛాన్స్ ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అందరూ సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్ కి ఫీచర్ స్టార్ అని అంటూ ఉంటుంటే ఇక ఇప్పుడు రాబిన్ ఉతప్ప కొత్త పేరును తెరమీదకి తీసుకోవచ్చాడు.