ప్రపంచ క్రీడాభిమానులు అందరూ ఎదురుచూసిన ఫిఫా వరల్డ్ కప్ ఎట్టకేలకు ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితం గా జరుగుతూ అభిమానులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగే మ్యాచ్లను వీక్షించేందుకు ప్రస్తుతం ప్రపంచ క్రీడా అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. ఇలా మ్యాచులు వీక్షించేందు కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు ప్రేక్షకులు.


 అంతేకాకుండా ఫిఫా ఫుడ్ బాల్ వరల్డ్ కప్ లో భాగంగా ఇక తమ అభిమాన జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించేందుకు కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. ఇకపోతే ఈ వరల్డ్ కప్ మ్యాచ్లలో మరోసారి అంతకుముందు ఛాంపియన్లుగా ఉన్న జట్లే వరల్డ్ కప్ గెలవడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే అభిమానులకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి.  ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న అర్జెంటీనా జట్టు ఇటీవల సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయింది.


 దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. 2-1 తేడాతో అర్జెంటీనా ఓటమి చవి చూడటంతో ఇక సౌదీ అరేబియా అభిమానులు అందరూ సంతోషంలో మునిగిపోయారు. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అయితే ఇటీవలే అర్జెంటినా పై సాధించిన విజయానికి గుర్తుగా నేడు అక్కడి ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లకు విద్యాసంస్థలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. దీన్నిబట్టి ఇక అర్జెంటినా పై విజయం తర్వాత సౌదీ అరేబియాలో సంబరాలు ఎంతలా అంబరాన్ని అంటాయో అర్థమవుతుంది క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: