ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కానీ ప్రాణాలకు తెగించి చేసిన విన్యాసం కాస్త చివరికి ప్రాణం మీదికే తెచ్చింది. సోషల్ మీడియాలో ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలన్నది సాయి కృష్ణ ఆరాటం. ఇందుకోసం ఏదో కొత్తగా చేయాలనుకున్నాడు. దీంతో ప్రాణాలను పణంగా పెట్టి మరి డేంజర్ స్టంట్ చేశాడు. కానీ చివరికి ప్రాణాల మీదకు వచ్చింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా ఉయ్యూరులో వెలుగు చూసింది. ఫక్కిలోని హైవేపై విన్యాసాలు చేసిన యువకుడు చివరికి తీవ్ర గాయాలు పాలై ప్రాణాలు కోల్పోయాడు.
బైపాస్ రోడ్డులో 20 రోజుల పాటు సాయి కృష్ణ ద్విచక్రవాహం తో డేంజర్ స్టంట్ చేశాడు. అయితే అతను అనుకున్నట్లుగా అది సక్సెస్ కాలేదు. చివరికి ప్లాన్ బోల్తా కొట్టడం తో ఇక విన్యాసం కాస్త ప్రాణాల మీదికి తెచ్చింది. పట్టు తప్పి కింద పడటం తో తీవ్ర గాయాల పాలయ్యాడు. 20 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన సాయి కృష్ణ చివరికి ప్రాణాలు వదిలాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. అయితే ఉయ్యూరు హైవేపై బైక్ విన్యాసాలు ఎంతో కామన్ గా మారి పోయాయని స్థానికులు అంటున్నారు.