ప్రస్తుతం టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటంలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్ ముగించుకొని ఇక ప్రస్తుతం వన్డే సిరీస్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ సహా మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటిస్తూ టీమ్ ఇండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ప్రపంచ క్రికెట్లో ఉన్న ఎంతోమంది స్టార్ ప్లేయర్లలో అటు విరాట్ కోహ్లీ మాత్రం ఫిట్నెస్ విషయంలో అందరికంటే ముందు ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎంతోమంది ప్లేయర్లకు ఫిట్నెస్ లో విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు. ఇక ఖాళీ సమయం దొరికిన లేకపోతే వరుస మ్యాచ్లతో బిజీగా ఉన్న ఇక ప్రతిరోజు వ్యాయామాలు చేయడం విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ అస్సలు అశ్రద్ధ వహించడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఖాళీ సమయంలో ఒకవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే మరోవైపు జిమ్ లో కసరత్తులు చేస్తూ చెమటోడుస్తున్నాడు విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ జిమ్ లో ఎంతో కష్టపడి పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒకవైపు ట్రేడ్ మిల్ పై పరుగులు పెడుతూ ఉన్న విరాట్ కోహ్లీ.. ఇక భారీగా బరువులు ఎత్తుతూ కూడా కనిపించాడు. ఇక ఈ వీడియో చూసి విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఫిట్నెస్ గురించి మాత్రం అస్సలు మర్చిపోడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: