డిసెంబర్ 23వ తేదీన బీసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించె ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మినీ వేలంలో ఎవరిని సొంతం చేసుకోవాలి అనే విషయంపై ప్రస్తుతం ఆయా జట్లు  అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక తమ దగ్గర ఉన్నపర్స్ మనీని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలని ఇక అన్ని ఫ్రాంచైజీలు భావిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే ఇక ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఈ విషయంపై ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్లు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ రివ్యూలను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ముగ్గురు ఆటగాళ్లకు మరికొన్ని రోజుల్లో జరగబోయే మినీ వేలంలో తెగ డిమాండ్ ఉండబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది.  ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరంటే..

 నారాయన్ జగదీషన్ :  పేలువ ప్రదర్శన చేయడంతో ఇతన్ని వేలంలోకి వదిలేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కానీ ఇటీవల విజయ్ హాజరే ట్రోఫీ లో అదరగొట్టిన జగదీషన్ కు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

 ఆడమ్ మిల్నే  : ఈ స్టార్ ప్లేయర్ ను ఒకటి పాయింట్ 9 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఇక ఇప్పుడు మినీ వేలంలోకి వదిలేసింది. అయితే 150 కిలోమీటర్ల పైగా వేగంతో బందులు విసిరే ఇతనికి భారీ డిమాండ్ ఉండబోతుందని తెలుస్తుంది.

 క్రిస్ జోర్డాన్  : గత సీజన్లో 3.60 కోట్లు పెట్టి ఇతని కొనుగోలు చేసింది సి ఎస్ కే. దారుణంగా విఫలమయ్యాడు.  దీంతో ఇతని మెనీ వేలంలోకి వదిలేసింది.  కానీ ఇప్పుడు టి20 ప్రపంచకంలో మంచి ప్రదర్శన చేయడంతో అతనికి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk