
ఎందుకంటే మిగిలిన ఆటగాళ్లు రాణించడం వలన సెమిస్ వరకు దూసుకెళ్లిన ఇండియా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పై ఓడిపోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఆ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ లో ఎంతో బలమైన ఇంగ్లాండ్ కు కేవలం 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం తోనే ఇండియా ఓటమి ఖరారు అయిందని చెప్పాలి. అంతే కాకుండా కీలకమైన ఈ మ్యాచ్ లో విరాట్ మరియు హార్దిక్ లు మినహా ఎవ్వరూ ఆకట్టుకోలేదు. రోహిత్ శర్మ , రాహుల్ మరియు సూర్య లు ఈ మ్యాచ్ లో దారుణంగా ఫెయిల్ అయ్యారు.
ఆ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించాలన్న విమర్శలు చాలా వచ్చాయి. కానీ ఇండియా టీం యాజమాన్యం అతనిని వెనకేసుకు వచ్చింది కానీ ముందు ముందు సిరీస్ లలో కనుక ప్రతిభకు తగిన విధంగా ఆటగాడిగా మరియు కెప్టెన్ గా రాణించకపోతే వేటు తప్పదు. మరి రోహిత్ శర్మ ఈ సిరీస్ లో అన్ని విధాలుగా టీం ను సక్సెస్ దిశగా నడిపించి విమర్శకుల నోళ్లను మూయిస్తాడా అన్నది చూడాలి.