
ఒకవైపు ఆటగాడిగా మరోవైపు కెప్టెన్ గా కూడా రవీంద్ర జటేజ ఆకట్టుకోలేకపోయాడు అనే విషయం తెలిసిందే. చివరికి మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకే అప్పగించడం గమనార్హం. దీంతో ఇక ధోని వారసుడిగా పిలుచుకునే జడేజాకు కెప్టెన్సీ చేసే అంత సీన్ లేదు అన్న విషయం అర్థమైంది. దీంతో ఇక జట్టులో ఎవరికి కెప్టెన్సీ అప్పగించబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే ఇక స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజు గైక్వాడ్ రూపంలో చెన్నై యాజమాన్యానికి ఒక ఆశా కిరణం లభించినట్లు తెలుస్తుంది.
ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను ఋతురాజ్ గైక్వాడ్ కి అప్పగించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఋతురాజుకు ఒకవైపు కెప్టెన్ ధోని నుంచి, మరోవైపు బ్యాటింగ్ కోచ్ మైక్ హాస్సి నుంచి కూడా మద్దతు ఉందట. ఏకంగా మైక్ హస్సి కెప్టెన్ గా మారితే బాగుంటుందని నేరుగా యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తోంది. రెండు సీజన్లా నుంచి ఋతురాజును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మైక్ హస్సి అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని గ్రహించాడట. ఈ క్రమంలోనే యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తుంది. ఇక ఈ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ గా అతడు పరిణితి కనబరిచిన తీరు కూడా సీఎస్కే యాజమాన్యాన్ని ఆకర్షించినట్లు తెలుస్తోంది.