మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాట్స్మెన్లు ఏమాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. అటు బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసారు అని చెప్పాలి. ఇక అందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసారు. ఈ క్రమంలోనే పరిస్థితులు టీమిండియా కు అనుకూలంగా ఉండడంతో భారత జట్టుదే విజయం అని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో పేలవమైన ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా అటు భారత జట్టు ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇకపోతే టీమ్ ఇండియా తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. 10 ఓవర్లు వేసిన షాకీబ్ అల్ హసన్ 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదే సమయంలో కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియా ఓటమిని శాసించాడు అని చెప్పాలి. తద్వారా భారత జట్టుపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్గా రికార్డు సృష్టించాడు షాకీబ్ ఆల్ హసన్. కాగా 2002లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆస్ట్రేలియా ఆశేలే గిల్స్ ఇండియా పై 10 ఓవర్లు వేసి 57 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటివరకు ఉత్తమ గణాంకాలుగా ఉండగా ఇటీవల షాకీబ్ అల్ హసన్ దీన్ని బ్రేక్ చేశాడు.