వరల్డ్ కప్ లో భాగంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మాత్రం అదిరిపోయే ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది అన్న విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యంతో తీవ్ర స్థాయిల విమర్శలు ఎదుర్కొన ఆస్ట్రేలియా ఇక అదే మైదానంలో మరోసారి సత్తా చాటి తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత జరుగుతున్న వరుస ద్వైపాక్షిక  సిరీస్ లలో కూడా సత్తా చాటుతుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు.


 ఈ క్రమంలోనే స్వదేశీ పరిస్థితిలను ఎంతగానో వినియోగించుకుంటున్న ఆసిస్ ఆటగాళ్లు అటు ప్రత్యర్థి  వెస్టిండీస్ ను చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే అటు రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది అని చెప్పాలి.



 రెండవ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు 496 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది  కేవలం 77 పరుగులకే కుప్పకూలిపోయింది వెస్టిండీస్ జట్టు. దీంతో ఆస్ట్రేలియా 419 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. కాగా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ ఏడు వికెట్ల నష్టానికి 511 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కాగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 214, 2వ ఇన్నింగ్స్ లో 77 పరుగులకు మాత్రమే పరిమితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: