ఇక ఇప్పుడూ టీమ్ ఇండియా జట్టులో మరో కీలక ఆటగాడు గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతని సారథ్యంలో ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయాన్ని సాధించింది. ఇక నేటి నుంచి రెండోవ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ కు ముందు టీం ఇండియాకు షాకింగ్ న్యూస్ అందింది. ఏకంగా వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడని కోచ్ రాథోడ్ తెలిపాడు. అయితే గాయం అంత తీవ్రమైంది కాదని రెండో టెస్ట్ కి రాహుల్ తప్పక బరిలోకి దిగుతాడని డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం రాథోడ్ వివరణ ఇచ్చాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ మ్యాచ్ కి దూరం అయితే మాత్రం ఇక టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉండగా వైస్ కెప్టెన్ గా చటేశ్వర్ పూజార కొనసాగుతున్నాడు. దీంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న పూజార కెప్టెన్ గా మారతాడని కొంతమంది అంటుంటే.. అనుభవజ్ఞుడైన కోహ్లీకి బాధ్యతలు అప్పజెప్పే ఛాన్స్ ఉందని మరి కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.