ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా అతని బౌలింగ్ తో అందరి దృష్టిని వైపుకు తిప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానే అన్న విషయాన్ని నిరూపించాడు. ఈ క్రమంలోనే ఇక అతన్ని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలి అంటూ మాజీ ఆటగాళ్లందరూ కూడా కూడగట్టుకుని డిమాండ్ చేసే విధంగా తన బౌలింగ్ తో ప్రభావితం చేశాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ తో ఆకట్టుకుంటూ ఉన్నాడు.


 ఇకపోతే ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగింది. సీనియర్లు రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు శ్రీలంకతో హోరాహోరీగా తలబడుతూ ఉంది. ఇకపోతే ఇటీవలే మొదటి టి20 మ్యాచ్ లో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రెండు పరుగులు తేడాతో భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల మొదటి టి20 మ్యాచ్ లో గెలిచిన అనంతరం పాస్టెస్ట్ యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇండియాలో తన ఫేవరెట్ ఆటగాళ్లు ఎవరు అన్న విషయాన్ని ప్రస్తావించాడు. టీమిండియాలో నా ఫేవరెట్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, అంటూ చెప్పుకొచ్చాడు. వీరి నుంచి చాలా నేర్చుకుంటాము. వీరు ఎప్పుడు మార్గ నిర్దేశం చేస్తూ ఉంటారు. వీరి బ్యాటింగ్ లో నాకు కోహ్లీ  కవర్ షాట్, రోహిత్ శర్మ ఫుల్ షాట్, కేఎల్ రాహుల్ ఫ్లిక్ షాట్ చాలా కష్టం అంటూ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: