ఇటీవల కాలంలో టీమిండియా జట్టులో ఎంతోమంది ఆటగాళ్లు అవకాశం దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త ఏడాదిలో శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టు బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. ఒకవైపు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ జట్టుకు అందుబాటులో లేని నేపథంలో అటు హార్దిక్ పాండ్యా జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపడుతున్నాడు.


 ఇప్పటికే శివం మావి, శుభమన్ గిల్ ల్లాంటి ఆటగాళ్లు ఇక టీమ్ ఇండియాలో టి20 ఫార్మాట్లో అరంగేట్రం చేసి సత్తా చాటుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల శ్రీలంకలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన పోరులో చివరికి భారత జట్టు రెండు పరుగులు తేడాతో విజయం సాధించగా..  నేడు రెండో టి20 మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. కాగా రెండో టి20 మ్యాచ్ లో పలు మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అని ఎంతోమంది అంచనా వేస్తున్నారు అని చెప్పాలి.


 అదే సమయంలో మొదటి టీ20 మ్యాచ్ లో గాయం బారిన పడిన సంజు శాంసన్ ఇక రెండో టి20 మ్యాచ్లో జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇక శ్రీలంకతో జరగబోయే రెండవ టి20 మ్యాచ్ లో భారత జట్టులోకి మరో కొత్త యువ ఆటగాడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుస్తుంది. జితేష్ శర్మ భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన జితేష్ శర్మను ఇక శ్రీలంకతో సిరీస్ లో అంతర్జాతీయ జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది  దీంతో భారత్ తరపున మొదటి మ్యాచ్ ఆడబోతున్నాడు సదర్ ఆటగాడు. కాగా రెండో టి20 మ్యాచ్లో గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమ్ ఇండియా సిరీస్ గెలుచుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: