
మొత్తంగా మూడవ టి20 మ్యాచ్ లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్.. 9 సిక్సర్లు ఏడు ఫోర్ లతో 112 పరుగులు చేశాడు. ఇక మరోసారి తన 360 డిగ్రీస్ బ్యాటింగ్తో ప్రేక్షకులందరికీ కూడా అలరించాడు అని చెప్పాలి. ఇక సూర్యకుమార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా 228 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఇక ఆ తర్వాత బౌలర్లు కూడా కట్టడి చేయడంతో భారీ పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ పై అందరూ ప్రశంసల కురిపిస్తున్నారు.
అయితే సూర్య కుమార్ యాదవ్ సిక్సర్ల సునామీతో చేసిన సెంచరీ తో ఇక భారత స్పిన్నర్ చాహల్ ఫిదా అయి పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం సూర్య కుమార్ ఇక నీకు తిరుగులేదు అన్నట్లుగానే ఇక అతను చేతికి ముద్దుపెట్టి కళ్ళకి అద్దుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే దీనిపై స్పందిస్తున్న సూర్య కుమార్ అభిమానులు సూర్య భాయ్ ఆట తీరు ముందు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పాలి.