
ఇక అందరూ ఊహించినట్లుగానే సొంత గడ్డపై అటు టీమ్ ఇండియా జట్టు సత్తా చాటింది అని చెప్పాలి. మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ కేవలం చేసుకుంది. మరి కొన్ని రోజుల్లో ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలో వన్డే సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇదే ఏడాదిలో భారత పర్యటనకు రాబోతుంది ఆస్ట్రేలియా జట్టు. ఈ క్రమంలోనే కీలకమైన టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ప్రస్తుతం టీమిండియా రెండవ స్థానంలో కొనసాగుతుండగా శ్రీలంక మూడవ స్థానంలో ఉంది. అయితే భారత జట్టు ఫైనల్ అడుగు పెట్టాలంటే ఇక స్వదేశీ పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియాపై తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది.
ఈ క్రమంలోనే ఇండియా పర్యటనలో భాగంగా భారత్తో ఆడబోయే టెస్ట్ సిరీస్ గురించి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుతో సిరీస్ ఆడాలనుకున్నప్పుడు ఎవరు కూడా గుడ్డిగా భారత పర్యటనకు వెళ్లరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక పాకిస్థాన్ లతో ఇటీవలే సిరీస్ ఆడిన అనుభవం ఇక భారత పర్యటనకు కూడా ఉపయోగపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికాలో మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.