ఇక ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్ లో భాగంగా హోరాహోరీగా పోరాడింది. అయితే ఇక న్యూజిలాండ్ దాటికి అటు పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేక పోయింది. అతి కష్టం మీద ఇక రెండు మ్యాచ్లను కూడా డ్రాగానే ముగించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక పాక్ ప్రదర్శన కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రైస్ నుంచి నిష్క్రమించే పరిస్థితిని కొని తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాబర్ ని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటు విమర్శలు వస్తున్నాయి.
ఇకపోతే గత కొంతకాలం నుంచి తనపై వస్తున్న విమర్శలపై బాబర్ అజాం ఇటీవల స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్స్ ని తోసిపు చ్చాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విలేకరులతో మాట్లాడాడు. తను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్ అయిపోయి ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక వన్డే సిరీస్ కు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటేనే అడగండి. కెప్టెన్సీ పై నాకు క్లారిటీ ఉంది. ఉచిత సలహాలు వద్దు.. ఇక జట్టు విజయం కోసంమెరుగైన ప్రదర్శన ఇవ్వడం పైనే నా దృష్టంతా ఉంది అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు.