ఇటీవల జరిగిన మూడవ టి20 మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయిన సూర్య కుమార్ యాదవ్.. మరోసారి తన విధ్వంసక బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు అని చెప్పాలి. మొత్తంగా  51 బంతుల్లో 112 పరుగులు సాధించాడు సూర్య కుమార్ యాదవ్. ఒక సూర్య కుమార్ యాదవ్ సెంచరీ తో చెలరేగిపోవడం కారణంగానే మూడో టి20 లో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది.


 ఇక తద్వారా మూడో టి20 మ్యాచ్ లో ఇక భారీ తేడాతో విజయం సాధించి ఇక సిరిస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి మాజీ ఆటగాళ్లు ఎంతోమంది స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానీష్ కనేరియా సైతం స్పందించాడు. సూర్య కుమార్ ఇన్నింగ్స్ ని ప్రశంసించాడు.  అంతేకాదు ఏ బి డివిలియర్స్,  క్రిస్ గేల్ ను సూర్యకుమార్ ఎప్పుడో మించిపోయాడు అంటూ కొనియాడాడు.


 ప్రపంచ క్రికెట్లో కొత్త యూనివర్సల్ బాస్ వచ్చాడు.  అతడు ఎవరు కాదు సూర్య కుమార్ యాదవ్. అతని మాట తీరు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షారాలతో సూర్య లికించుకుంటాడు  అని. 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు అని నా అభిప్రాయం.. అందరూ సూర్య ని డివిలియర్స్, క్రిస్ గేల్ తో పోలుస్తున్నారు. కానీ వారిద్దరు కూడా సూర్యకుమార్ ముందు తేలిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. వారిద్దరినీ సూర్య కుమార్ ఎప్పుడో అధిగమించాడు అంటూ కనేరియా ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: