అయితే మొన్నటి వరకు పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడిన కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అదరగొడుతూ ఉండగా... అటు ఇప్పుడు మాత్రం రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. రోహిత్ లాంటి కీలక ఆటగాడు పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ ఉండడం మాత్రం అటు టీమ్ ఇండియాను ప్రతి మ్యాచ్ లో కూడా కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ తన వైఫల్యాలతో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు.
కెప్టెన్ కావడం వల్లే ఇంకా అతను పేలవ ప్రదర్శన చేసిన జట్టులో కొనసాగిస్తున్నారు అంటూ కొంతమంది ఘాటు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా రోహిత్ శర్మ ఫామ్ గురించి భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అనడంలో సందేహం లేదు. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు చేశాడు. ఇక ఇప్పుడు అదే ఫామ్ ను తిరిగి అందుకోవాలి. రోహిత్ ఫామ్ లోకి వస్తే వన్డే ప్రపంచ కప్ లో భారత్ను మించిన జట్టు ఉండదు అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.