1983 తర్వాత టీమిండియా కు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను 2011లో అందించాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ క్రమంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ రిటర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రస్తుత క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోని క్రేజీ ఎక్కడ తగ్గలేదు అని చెప్పాలి. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతూ ప్రేక్షకులను ప్రతి ఏడాది అలరిస్తూనే ఉన్నాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్షణం ఇక అభిమానుల గుండె పగిలిపోయినంత పని అయింది.
ధోని తన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం గురించిని ఇటీవల టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్ సమయంలోనే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని విషయం అతని మాటల్లో అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు అర్ శ్రీధర్. ఆరోజు ధోని, నేను, రిషబ్ పంత్ కలిసి బ్రేక్ ఫాస్ట్ హాల్లో కూర్చున్నాము. ఈ సమయంలో తాను ముందే లండన్ వెళ్ళిపోతున్నానని చెప్పిన రిషబ్ పంత్ ధోనిని కూడా తనతో పాటు రమ్మన్నాడు. కానీ ధోని టీం తో నా చివరి బస్సు ప్రయాణం మిస్ కాను అంటూ సమాధానం చెప్పాడు. ఇక అప్పుడే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ధోని రిటైర్మెంట్ ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించాను అంటూ తెలిపాడు.