
శ్రీలంక జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సత్తా చాటింది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇకపోతే భారత గడ్డపై టీమిండియా మరింత సత్తా చాటాలని భావిస్తుంది. క్లీన్ స్వీప్ పై కన్నేసింది. కాగా నేడు మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇది నామమాత్రమైన మ్యాచ్ కావడంతో ఇక టీమ్ ఇండియా జట్టులో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
గత రెండు మ్యాచ్లలో బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్ళకు మూడో వన్డే మ్యాచ్ లో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. తిరువనంతపురం వేదికగా జరగబోయే ఈ మూడో వన్డే మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు ఇక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక రెండు వన్డే మ్యాచ్లలో జట్టులో భాగమైన గిల్, శ్రేయస్ అయ్యర్ లకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుందట. ఆఖరి మ్యాచ్ లో తప్పకుండా మార్పులు ఉంటాయని ఇప్పటికే అటు రోహిత్ శర్మ కూడా క్లారిటీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే.