ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా ఈసారైనా అటు టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా అన్న విషయం పైన చర్చ జరుగుతుంది. అయితే మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పటివరకు టీమిండియా వరల్డ్ కప్ గెలవక దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా పై విమర్శలు కూడా పెరిగిపోయాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులు తొందరపడకుండా కాస్త వేచి చూడాలి అంటూ సూచించాడు.
1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ వచ్చింది. ఇక తర్వాత ధోని కెప్టెన్సీ చేపట్టిన కొంతకాలానికి వరల్డ్ కప్ దక్కింది. అయితే వరల్డ్ కప్ కోసం ఎంతోమంది దిగ్గజాలు కూడా వేచి చూసారు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు కూడా కాస్త సమయం ఇవ్వాలి. 2007 ప్రపంచ కప్ లో వారు ఆడలేదు. రోహిత్ 2011 లోను మిస్ అయ్యాడు. కోహ్లీ 2011, 2017, 2019 టోర్నీలో ఆడాడు. ఈ ఏడాది ప్రపంచకప్ అతనికి నాలుగోది. అయితే అతను మాత్రం ఐసీసీ ట్రోఫీ గెలవలేదని అంటూ ఉంటారు. కానీ అతను 2011లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు. అలాగే 2013లో ఛాంపియన్ ట్రోఫీ కూడా అందుకున్నాడు. రోహిత్ కూడా అంతే. అందుకే వారిద్దరికీ సమయం ఇవ్వాలి.. అభిమానులు ఓపిక పట్టాలి అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.