
ఇక అతని కెరియర్లో సాధించిన పరుగులలో ఎక్కువ మొత్తం ఇక సిక్సర్ల ద్వారా వచ్చినవే ఉన్నాయి అని చెప్పాలి. అలాంటి క్రిస్ గేల్ ఇక ఎంతోమంది బౌలర్లకు సింహ స్వప్నంలా కొనసాగాడు ఏకంగా అతని విధ్వంసం ముందు బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు భయపడిపోయేవారు అని చెప్పాలి. ఇలా విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్ల వెన్నుల్లో వణుకు పుట్టించిన క్రిస్ గేల్ కే.. ఒక బౌలర్ ఏకంగా వణుకు పుట్టించాడట. ఆ బౌలర్ ఎవరో కాదు టీమ్ ఇండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా కావడం గమనార్హం.
క్రికెట్లో ఇప్పటివరకు తన కెరీర్ లో ఎదుర్కొన్న ఎంతో మంది బోర్డర్లలో భారత బౌలర్ బుమ్రా అందరికంటే ఎంతో కఠినమైన బౌలర్ అంటూ చెప్పుకొచ్చాడు వెస్టిండీస్ దిగజం క్రిస్ గేల్. ఐపీఎల్, టి20 ఫార్మట్ లో కూడా ఇక బుమ్రా బౌలింగ్లో పరుగులు చేయడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ తెలిపాడు. రన్స్ చేయకుండా ఎంతగానో ఇబ్బంది పెట్టేవాడు అంటూ క్రిస్ గేల్ ఇటీవల వివరించాడు. అతను వేసే స్లో బాల్ కి ఆడటం ఎంతో కఠినంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రిస్ గేల్ వ్యాఖ్యలను మాజీ ప్లేయర్స్ స్కాట్ స్టైరిష్ సైతం సమర్ధించాడు అని చెప్పాలి. క్రిస్ గేల్ లాంటి ఆటగాడు ఇక అలా మాట్లాడటంతో బుమ్రా అభిమానులు ముగిసిపోతున్నారు.