ఎందుకంటే గత కొంత కాలంగా రాహుల్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో కూడా సరిగ్గా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో bcci రాహుల్ ని జట్టుకు భారంగా ఫీల్ అవుతోంది. ఇక వివాహం తర్వాత రాహుల్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఇది ఒకరకంగా KL రాహుల్ కు ఆఖరి ఛాన్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రంజీల్లో టన్నులకొద్ది పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్లు టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నవేళ రాహుల్ ఆసీస్ సిరీసుల్లో రాణించాల్సి ఉంది.
ఇక ఆ తరువాత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో రెండవవాడు. కుల్దీప్ యాదవ్ ఇపుడు అద్బుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ను టీంలో ఎక్కువ కాలం ఉంచకపోవచ్చు అనే గుసగుసలు వినబడుతున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ బంతి అస్సలు మేజిక్ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆసీస్ తో జరిగే సిరీస్ లో అశ్విన్ వికెట్లు తీయాల్సి ఉంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ తో తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. పంత్ లేకపోవడంతో అతడి స్థానంలో శ్రీకర్ ను వికెట్ కీపర్ గా తీసుకునే అవకాశం మెండుగా ఉంది. అయితే శ్రీకర్ భరత్ అరంగేట్రం ఏదో ఫార్మాలిటీగా జరుగుతున్నట్టు భోగట్టా.