
ఇకపోతే ఒలంపిక్స్ ఎంటర్టైన్మెంట్ను అటు ప్రేక్షకులందరికీ మరింత సరికొత్తగా పంచేందుకు ఇక కొత్తగా మరిన్ని క్రీడలను కూడా ఈ వరల్డ్ గేమ్స్ లో చేర్చేందుకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక 2024 పారిస్ ఒలంపిక్స్ కోసం ఆయా విభాగాలకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గత ఒలంపిక్స్ లో పథకం చేజార్చుకున్న వారు ఈసారి ఎలాగైనా బంగారు పథకాన్ని సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే 2024 ఒలింపిక్స్ గురించి ఉక్రెయిన్ టెన్నిస్ ప్లేయర్ ఏలిన స్వీట్ ఓలినా ఆసక్తికర డిమాండ్ చేస్తుంది.
రష్యా బెలారస్ కు చెందిన ప్లేయర్స్ 2024 పారిస్ ఒలంపిక్స్ నుంచి బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేయడం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న అరాచకాలు రష్యా బెలారస్ ప్రజలకు అస్సలు తెలియవు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండు దేశాలకు చెందిన ప్లేయర్స్ ను ఒలింపిక్స్ నుంచి నిషేధం విధించి తమ దేశానికి మద్దతు పలకాలి అంటూ కోరింది ఎలినా స్వీటో లేనా. ఒకవేళ ఒలంపిక్స్ నిర్వాహకులు కాస్త ఇదే చేస్తే మాత్రం అది మరింత సంచలనంగా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఉక్రెయిన్,రష్యా మధ్య అటు దాదాపు ఏడాది కాలం నుంచి కూడా బీకర రీతిలో యుద్ధం జరుగుతూ వస్తుంది.