
అయితే ఇరు దేశాలు ప్రపంచ క్రికెట్లో దాయాది దేశాలుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ.. అటు ఆటగాళ్లు మాత్రం మైదానం లో కలిసిన ఒకటి రెండు సార్లు అయినా సరే ఎంతో స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు. ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా పలకరించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా టీమిండియా పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహభావం అభిమానుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఉమర్ అక్మాల్ గతంలో భారత గడ్డపై క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నాడు.
పాకిస్తాన్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. భారత్, ఆసియాలో ఆడటం నాకెంతో ఇష్టం. నేను ఇప్పుడు వరకు పాకిస్తాన్లో పెద్ద సిరీస్ ఆడలేదు. ఇక్కడ రెండు టీ20 లు మాత్రమే ఆడాను. ఈ రెండు మ్యాచ్లలో కూడా ఒక్క పరుగు చేయకుండా అవుట్ అయ్యాను. అయితే భారత్లో నేను ఆడినప్పుడు మాత్రం నా సొంత దేశంలోనే ఆడినట్లు అనిపించేది. భారత ప్రేక్షకులు తమ జట్టు ఆటగాళ్లతో పాటు ఇక పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లను కూడా అమితంగా గౌరవిస్తూ ఉంటారు. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఉత్సాహపరుస్తూ ఉంటారు అంటూ ఉమర్ అక్మల్ చెప్పుకొచ్చాడు.