
ఈ క్రమంలోనే ఇలా టీమిండియా మ్యాచ్ ఆడబోయే ప్రతిసారి కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు ఇక తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టు ఏంటి అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ అభిప్రాయం ప్రకారం తుది జట్టులో ఎవరు ఉంటారు అనే విషయంపై రివ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇక ఇలా రివ్యూలు ఇవ్వడంలో టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ఎప్పుడు ముందుంటారు అన్న విషయం తెలిసిందదే. ఇకపోతే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ జరగబోతుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు తరఫున తుది జట్టులో ఎవరు ఉండబోతున్నారు అన్న విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మాజీ ప్లేయర్ వసీం జాఫర్ తొలి టెస్ట్ మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. ఇక ఆ వివరాలు చూసుకుంటే..
కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్ చటేశ్వర్ పూజార, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, కేఎస్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ లు తుదిజట్టులో ఉండాలని అంచనా వేశాడు వసీం జాఫర్. ఇక వీరితో తుది జట్టు ఎంపిక చేస్తే టీమిండియాకు తిరుగు ఉండదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి వసీం జాఫర్ ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలవెన్ జట్టుపై మీరు ఏమనుకుంటున్నారు.