జింబాబ్వే లో పుట్టి పెరిగిన గ్యారీ బ్యాలెన్స్ ఇక ఆ తర్వాత ఇంగ్లాండులో స్థిరపడ్డాడు. క్రికెట్ మీద మక్కువతో అక్కడ బాగా రాణించి ఇక ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చి దాదాపు ఏడేళ్ల పాటు అంతర్జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇక అక్కడ ఫామ్ కోల్పోయి ఇక జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. ఇక తన సొంత దేశమైన జింబాబ్వే రాగా ఇక మళ్ళీ అంతర్జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
ఈ క్రమంలోనే మొదట పరాయి దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఆ తర్వాత సొంత దేశం తరఫున ఆడిన మొదటి క్రికెటర్ గా అరుదైన రికార్డులను సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి తన ఆటతీరుతో వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల జింబాబ్వే ఆడిన మ్యాచ్లో గారీ బ్యాలెన్స్ ఏకంగా సెంచరీ చేశాడు. దీంతో ఏకంగా రెండు దేశాల తరఫున ఆడి సెంచరీ చేసిన రెండో బాట్స్మన్ గా అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే జింబాబ్వే తరఫున తొలి టెస్ట్ ఆడుతున్న బ్యాలెన్స్ వెస్టిండీస్ పై 137 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గతంలో ఇంగ్లాండ్ తరఫున నాలుగు సెంచరీలు చేశాడు. ఇక అంతకుముందు కెప్లర్ వెసెల్స్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తరఫున సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన మొదటి ప్లేయర్గా నిలిచాడు.