గత కొంతకాలం నుంచి టీమిండియాను గాయాలబెడదా తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కీలకమైన మ్యాచులకు ముందు జట్టులో కీ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే టీమ్ ఇండియా ప్రధాన బౌలర్ అయిన బుమ్రా గాయం కారణంగా కొన్ని నెలల నుంచి జట్టుకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. అయితే అటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం మోకాలి గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చి మంచి పరిదర్శన చేస్తూ ఉన్నాడు.


 ఇక రవీంద్ర జడేజా వచ్చాడు అని సంతోషపడేలోపే ఇక మరో కీలక ప్లేయర్ జట్టుకు అందుబాటులో లేకుండా పోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే వెన్నునొప్పి గాయం కారణంగా మొదటి టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో లేకుండానే పోయాడు శ్రేయస్ అయ్యర్.  ఇక రెండవ టెస్టులో అతను అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ ఢిల్లీ వేదికగా జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్ కి కూడా శ్రేయస్సు అయ్యర్ దూరం అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు అయ్యర్.


 ఇటీవల అక్కడ ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్న కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే సాధారణంగా ఏ ఆటగాడు అయినా గాయం నుంచి కోలుకున్నాక తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే ఏదో ఒక దేశ వాలీ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది అని చెప్పాలి.  కానీ ఒక నెల రోజుల నుంచి శ్రేయస్ అయ్యర్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కాబట్టి  నేరుగా ఇక ఆస్ట్రేలియాతో జరగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్ లొ ఆడించే అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇరానీ కప్ (మార్చ్ ఒకటి నుంచి ఐదు వరకు) జరిగే మ్యాచ్లలో మధ్యప్రదేశ్తో తలబడే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు అతని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక అక్కడ ఆడటం ద్వారా శ్రేయస్  ఫిట్నెస్ నిరూపించుకుని మళ్ళీ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: