ప్రస్తుతం భారత జట్టు వరుస షెడ్యూల్ తో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇందులో భాగంగానే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక ఈ టెస్ట్ సిరీస్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే గత కొన్ని సీజన్లో నుంచి వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంటున్న టీమిండియా జట్టు.. ఇక ఇప్పుడు కూడా అదే రీతిలో ఆదిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. భారత జట్టును వారి సొంత దేశంలో ఓడించడం అసాధ్యం అన్నమాట నిజం చేస్తూ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం సాధిస్తుంది.


 అయితే ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో విజయం సాధించడం అటు భారత జట్టుకు ఎంతో కీలకం. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది టీమ్ ఇండియా. అయితే ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ విజయం సాధిస్తేనే అటు భారత్ జట్టు వరల్డ్ చెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక దీని కోసమే ఆస్ట్రేలియాతో హోరాహోరీగా పోరాడుతుంది టీమ్ ఇండియా అని చెప్పాలి.


 ఇకపోతే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా జట్టు ఇక ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచిన టీమిండియా ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టేందుకు అడుగు దూరంలోనే ఉంది అని చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరగబోయే మిగతా రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా రోహిత్ సేన ఎలాంటి సమీకరణలు లేకుండానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా జోరు చూస్తే ఒక్క మ్యాచ్ కాదు వరుసగా రెండు మ్యాచ్లలో కూడా గెలవడం ఖాయమని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: