
మరి కొంతమంది మాస్టర్ బ్లాస్టర్ అనే మరో ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్లో సాధించిన అరుదైన రికార్డులు ఇప్పటికీ కూడా పదిలం గా ఉన్నాయి అంటే అతని ప్రస్థానం ఎంత విజయవంతంగా కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లో స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ప్లేయర్లు సచిన్ రికార్డులకు ఎవ్వరూ కూడా చేరువలోకి రాలేకపోయారు. ఇక ఇలా తన అద్భుతమైన ఆట తీరుతో టీమిండియా కు ఎన్నో అద్వితీయమైన విజయాలు అందించిన కొన్నాళ్లపాటు ఇక జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించారు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవల సచిన్ గురించి పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ గొప్ప బ్యాట్మెన్ అనడం లో సందేహం లేదు. కానీ కెప్టెన్ గా మాత్రం అతను నిరూపించుకోలేక పోయాడు అంటూ షోయబ్ అక్తర్ కామెంట్ చేశాడు. అతను ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక అతను మరింత బాగా ఆడాడు అంటూ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాకే మళ్ళీ పరుగులు చేస్తున్నాడని.. ఒకప్పుడు సచిన్ లాగానే జట్టు భారాన్నంతా కోహ్లీ మోసాడని షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.