సాధారణంగా ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఆ మ్యాచ్ లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉంది అనే దాని పైన చర్చ జరుగుతూ ఉంటుంది.కానీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కంటే అటు పిచ్ ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్ల వేదికలకు సంబంధించిన పిచ్ గురించి తీవ్రమైన చర్చ జరిగింది.


 ఇక మూడో మ్యాచ్ కి ఆతిథ్యం ఇచ్చిన ఇండోర్ పిచ్ కి ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇంకా మ్యాచ్ మొదలుకానే లేదు అప్పుడే నాలుగో మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్ గురించి క్రీడా పండితులు,  ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు తమ విశ్లేషణలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇక పిచ్ తయారీ గురించి మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను ధోని తయారు చేయమని చెప్పాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ధోని కెప్టెన్సీ చేపట్టడం కంటే ముందు మీరు గమనిస్తే ప్రతి టెస్ట్ మ్యాచ్ కనీసం నాలుగు రోజులు తప్పకుండా జరిగేది. చివరి సెషన్ లేదా ఐదో రోజు ఫలితం వచ్చేది. అప్పుడు పిచ్ మీద కాస్త గడ్డి తేమ ఉండే విధంగా ఉండేవి. అవి ఫాస్ట్ బౌలర్కు ఉపయోగపడేవి. ఇక మూడు రోజుల తర్వాత స్పిన్నర్లకు పిచ్ లు అనుకూలంగా మారేవి. కానీ టెస్టుల్లో ధోని సాధ్యం చేపట్టాక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లని తయారు చేయాలని చెప్పాడు. ఈ పిచ్ లు అంటే భారత ఆటగాళ్ళకు చాలా కష్టమంటూ ధోని చెప్పాడు. అప్పటినుంచి ఇలాంటి పిచ్ లే తయారు చేశామంటూ దల్జీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో దల్జిత్ సింగ్ చాలా ఏళ్లపాటు గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీ కి చైర్మన్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: