
ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకొని జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా ఎంటర్టైన్మెంట్ పంచుతూ ప్రతి షోకి రేటింగ్ సంపాదించే మూల స్తంభంగా మారిపోయాడు హైపర్ ఆది. ఇక మరోవైపు అన్నిషోలకు కూడా స్క్రిప్ట్ అందిస్తూ భారీగానే సంపాదిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక షోలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నాడు.
నన్ను, అన్నయ్యలను చదివించడానికి 20 లక్షల అప్పు అయిందని ఆ అప్పు తీర్చడానికి మా నాన్న ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మేశాడు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. అయితే జబర్దస్త్ కు వచ్చిన తర్వాత అదే ఊరిలో మళ్లీ 16 ఎకరాలు కొన్నాను అంటూ హైపర్ ఆది తెలిపాడు. అంతే కాకుండా తండ్రి చేతికి పదివేలకు పది ఉంగరాలు కూడా చేయించాను అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. ఇక హైదరాబాద్లో కూడా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు హైపర్ ఆది. అయితే ఇక ఇప్పుడు ఈటీవీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకు ఉంటుంది కూడా హైపర్ ఆది అనేది తెలుస్తుంది. ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు లక్ష నుంచి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటాడట హైపర్ ఆది. ఇక అన్ని కార్యక్రమాలకు స్క్రిప్ట్ అందించినందుకు అదనంగా మరో లక్ష కూడా పుచ్చుకుంటాడట. మరోవైపు సినిమాల్లో లో కూడా బిజీ అవుతూ బాగానే సంపాదిస్తున్నాడు హైపర్ ఆది.