ప్రతి ఏడాదిలా గానే ఈ ఏడాది కూడా భారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి ఇక తమ రివ్యూలను చెప్పేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక విషయం అటు చర్చకు వస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో ఆల్ టైం బెస్ట్ ఎలెవెన్ ప్లేయర్లు ఎవరు అన్న విషయంపై కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఆయా స్థానాలలో బలిలోకి దిగి చెక్కుచెదరని రికార్డులను క్రియేట్ చేసిన ఆటగాళ్ళు ఎవరు అన్న విషయం చర్చకు రాగా ఇక కొంతమంది ప్లేయర్ల పేరు తెరమీదకి వచ్చింది. ఓపెనింగ్ లో బరిలోకి దిగి అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాళ్లుగా నెంబర్వన్ స్థానంలో డేవిడ్ వార్నర్, నెంబర్ 2 స్థానంలో శిఖర్ ధావన్ నిలిచాడు అని చెప్పాలి.  ఐపీఎల్ హిస్టరీలో 4864 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. అదే సమయంలో 4852 పరుగులు చేసి శిఖర్ ధావన్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ దిగి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సురేష్ రైనా నిలిచాడు. అయితే ప్రస్తుతం సురేష్ రైనా క్రికెట్ నుంచితప్పుకున్నాడు. మూడో స్థానంలో ఆడుతూ 4934 పరుగులు చేశాడు రైనా.



 ఇక నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేసి ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ మహేంద్రసింగ్ ధోని ఉన్నారు. రోహిత్ 2392 పరుగులు చేస్తే ధోని 1949 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ ఆరు, ఏడు స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కిరణ్ పోలార్డ్ 1372 పరుగులతో ఆరో స్థానంలో, ఆండ్రు రసేల్ 718 పరుగుతో 7వ స్థానంలో ఉన్నారు. 8, 9, 10, 11 స్థానాల విషయానికొస్తే హర్భజన్ 406 పరుగులు, భువనేశ్వర్ 167 పరుగులు  ప్రవీణ్ కుమార్ 86 పరుగులు, మునాఫ్ పటేల్ 30 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నారు. అయితే ఇక ఇలా ఆల్ టైం మోస్ట్ రన్స్ స్కోరు బ్యాట్స్మెన్ల జాబితాలో మాత్రం విరాట్ కోహ్లీకి చోటు లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl