విరాట్ కోహ్లీ అభిమానులు అందరిలో కూడా కొత్త ఊపిరి నిండిపోయింది. కారణం దాదాపు మూడున్నరేళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్లో సెంచరీ చేశాడు. అయితే మూడేళ్లపాటు వరస వైఫల్యాలతో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత పుంజుకొని వన్డే టీ20 ఫార్మాట్లో సెంచరీ తో చెలరేగాడు. ఇక ఎంతో అలవోకగా టెస్ట్ ఫార్మాట్ లో కూడా సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ నుండి కోహ్లీ చెప్పుకో ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే నాలుగో మ్యాచ్లో కూడా కోహ్లీ బ్యాట్ నుంచి పెద్దగా ప్రదర్శన ఆశించలేదు అభిమానులు..


 కానీ ఊహించిన రీతిలో ఫ్యాన్స్ అందరినీ ఉర్రూతలూగిస్తూ  అదిరిపోయే సెంచరీ చేశాడు. ఇక డబుల్ సెంచరీ దిశగా సాగినప్పటికీ చివరికి 180 కి పైగా పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సాలిడ్ ఇన్నింగ్స్ తో అతని పని అయిపోయిందంటూ విమర్శలు చేసిన వాళ్ళ నోళ్లు ముగించాడు అని చెప్పాలి. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత ఇక కోహ్లీ బ్యాట్ తీసుకుని స్మిత్  పరీక్షించిన విజువల్స్ ఫోటోలు ఇప్పటికే చూసే ఉంటారు. ఇక ఇప్పుడు కోహ్లీ సెంచరీపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్  వార్నర్ పెట్టిన పోస్ట్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.



 సాధారణంగా విరాట్ కోహ్లీ అంటే పాత జనరేషన్ ఆటగాళ్లతో పాటు ఇప్పటి తరం ప్లేయర్లకు కూడా ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. ఇక కోహ్లీకి అభిమానులుగా ఉన్న వారిలో స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా ఉంటాడు. వార్నర్ తో పాటు అతని కూతురు కూడా కోహ్లీకి వీరాభిమాని కావడం గమనార్హం. అందుకే కోహ్లీ ఎప్పుడు మంచి ప్రదర్శన చేసిన కూడా డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మూడున్నర ఏళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లో కోహ్లీ సెంచరీ చేసిన నేపథ్యంలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.  ఛాంపియన్స్ కు తిరుగులేదని వాళ్ళు చెప్పారు అంటూ కోహ్లీ ఫోటోని షేర్ చేశాడు డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: