
మొదటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియా.. ఇక ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండో వన్డే మ్యాచ్లో మరింత జోరుగా ఆడుతుంది అనుకుంటే ఇక టీమిండియా పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలింగ్ విభాగం పరవాలేదు అనిపించిన.. బ్యాటింగ్ విభాగం మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలం అయింది అని చెప్పాలి.
ఇకపోతే భారత ఓటమిపై అటు అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయం పై స్పందించిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా చేతిలో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఈ ఓటమిని తేలిగ్గా తీసుకోవద్దు అంటూ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. ఐపీఎల్ మాయలో పడి ఈ ఓటమిని మర్చిపోతే టీమిండియా పెద్ద తప్పు చేసినట్లే. ఎందుకంటే ఈ ఏడాది వరల్డ్ కప్ లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలబడుతుంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది. అందుకే ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అంటూ సునీల్ గవాస్కర్ సూచించాడు.