
కానీ రిషబ్ పంత్ ఇక ఢిల్లీ జట్టుకు చేసిన సేవలను మాత్రం మరవలేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న పంత్ కు ఒక అరుదైన గౌరవం ఇచ్చేందుకు ఢిల్లీ జట్టు యాజమాన్యం సిద్ధమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరికీ క్యాప్ లు జెర్సీలపై కూడా రిషబ్ పంత్ జెర్సీ నెంబర్ ఉండేలా చూడాలని అనుకుంటుందట ఢిల్లీ యాజమాన్యం. ఈ విషయంపై ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రిషబ్ పంతును మేము చాలా మిస్ అవుతున్నాం. ప్రతి మ్యాచ్ కు అతడు డగ్ అవుట్ లో నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నా. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతడిని జట్టులో భాగం చేయాలనుకుంటున్న. అందుకే మేము అతని జెర్సీ నెంబర్ను ఇతర ఆటగాళ్ల జెర్సీలు లేదా క్యాప్ లపై ఉంచాలి అని భావిస్తున్నాం. పంత్ జట్టులో లేకపోయినా ఎప్పటికి అతడు మా నాయకుడే అంటూ తెలియజేయడం కోసమే ఇదంతా చేస్తున్నాం. అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.