ఈ క్రమంలోనే అసలు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కి ముంబై ఇండియన్స్ తొలి జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గత ఏడాది ఇక ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైన సమయంలో అయినా కనీసం అర్జున్ టెండూల్కర్ తో ప్రయోగం చేస్తారు అని అనుకున్నారు అందరూ. కానీ అది చేయలేదు ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం అర్జున్ టెండూల్కర్ కు ముంబై ఇండియన్స్ తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
2021 లోనే ముంబై ఇండియన్స్ టీం లో చేరిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు ఐపిఎల్ లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకోలేదు. అయితే ప్రస్తుతం బుమ్రా రిచర్డ్ సన్ గాయపడటంతో ఇక తుది జట్టులోకి తీసుకునే ఆటగాళ్ల లిస్టులో అర్జున్ టెండూల్కర్ పేరును పరిశీలిస్తుందట ముంబై యాజమాన్యం. కామరూన్ గ్రీన్ తో కలిసి ఇక అర్జున్ టెండూల్కర్ కూడా ఆల్రౌండర్ గా సేవలు అందించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో సైతం తుది జట్టులోకి తీసుకునేందుకు అర్జున్ పేరును పరిశీలిస్తున్నామంటూ చెప్పిన విషయం తెలిసిందే.