ఇక మహిళా క్రికెట్లో కూడా ఇలా పురుషుల అంపైర్లుగా ఉన్నారు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో ఇక అటు మహిళ అంపైర్లను కూడా పురుషుల క్రికెట్లో భాగం చేసేందుకు నిర్ణయించిన ఐసిసి... ఆ దిశగా అడుగులు వేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టి20 మ్యాచ్లో ఏకంగా ఒక మహిళ అంపైరింగ్ చేయడం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తొలిసారి ఇక పురుషుల మ్యాచులో ఫీల్డ్ అంపైర్ గా మహిళ వ్యవహరించడం జరిగింది అని చెప్పాలి. దీంతో ఇక ఇలా ఎంపైర్గా వ్యవహరించిన కిమ్ కాటన్ అరుదైన రికార్డును సృష్టించింది.
పురుషుల క్రికెట్లో అంపైరింగ్ చేసిన తొలి మహిళగా సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయితే గతంలో ఈమె పేరిట పలు రికార్డులు ఉన్నాయి అని చెప్పాలి. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో అంపైర్ గా వ్యవహరించిన తొలి మహిళగా కూడా కిమ్ కాటన్ అరదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు అని చెప్పాలి. ఇప్పటివరకు అత్యధికంగా 54 టీ20 లతో పాటు 24 వన్డే మ్యాచ్ లలో కూడా అంపైరింగ్ చేశారు కిమ్ కాటన్. ఇక రానున్న రోజుల్లో అటు పురుషుల క్రికెట్లో మహిళ అంపైర్ల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.