రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈ టీం గురించి చెబితే పేజీలు కూడా సరిపోవేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో చరిత్ర కలిగింది ఈ టీం. చరిత్ర అనగానే టైటిల్స్ గెలవడంలో అనుకోకండి ప్రతి సీజన్లో ఓడిపోవడం లో చరిత్ర కలిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం. ఐపీఎల్ మొదలైన మొదటి సీజన్ నుంచి కూడా ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతూ వస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక మూడుసార్లు ఫైనల్ గడప తొక్కింది. కానీ రన్నర్ ఆఫ్ తోనే సరిపెట్టుకుంది. అయితే యాదృచ్ఛికమో లేకపోతే ఆ జట్టుకు ఉన్న దురదృష్టమో తెలియదు కానీ ప్రతి సీజన్లో మాత్రం ఏదో ఒక మ్యాచ్ లో దారుణ ఆట తీరును కనబరచడం ఆర్సిబి కి అలవాటుగా మారిపోయింది.


 ఇక ఏ మ్యాచ్లో విజయం సాధిస్తుంది.. ఏ మ్యాచ్ లో ఓడిపోతుంది అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. ఒక మ్యాచ్ లో విజృంభించి అందరిలో అంచనాలను పెంచేయడం.. ఆ తర్వాత మ్యాచ్లో బొక్క బోర్లా పడటం.. కేవలం ఆర్సీబీకి మాత్రమే సాధ్యం అని చెప్పాలి. ఇక ఇటీవలే 2023 ఐపీఎల్ సీజన్లోనూ వింటేజ్ ఆర్సిబినీ గుర్తు చేసేలా ప్రదర్శన చేసింది. కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. 123 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 81 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది.


 ఒకానొక సమయంలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ సమయంలో ఆకాశదీప్, డేవిడ్ మిల్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 81 పరుగుల తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి. లేదంటే 100 పరుగుల తేడాతో ఆల్ అవుట్ అయ్యేది. అయితే అంతకుముందు ముంబై తో జరిగిన మ్యాచ్లో మాత్రం చెలరేగిపోయింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది బెంగళూరు జట్టు. విరాట్ కోహ్లీ 82 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు అని చెప్పాలి. 73 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ డూప్లేసెస్. ఆర్సిబి ఆట తీరు చూసిన ఫ్యాన్స్ ఆర్సిబి ఎప్పటికి ఎవరికీ అర్థం కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb