ఐపీఎల్ లో ఉన్న అన్ని ఫ్రాంచైజీల  గేమ్ స్ట్రాటజీ పై అటు విశ్లేషకులకు ఒక అంచనా ఉంటుంది. కానీ అటు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గేమ్ స్ట్రాటజీ  మాత్రం వారికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు అని చెప్పాలి. సాధారణంగా టి20 ఫార్మాట్ లో అద్భుతమైన రికార్డులు ఉన్న ఆటగాడిని కొనుగోలు చేయడానికి అన్ని ఫ్రాంచైజీ లు  ఎక్కువ ధర పెడుతూ ఉంటాయి. కానీ సన్రైజర్స్ మాత్రం ఎప్పుడు ఎవరికీ ఎక్కువ ధర పెడుతుందో అసలు అర్థం కాదు. 2023 సీజన్ కు సంబంధించి గత ఏడాది జరిగిన మినీ వేలంలో కూడా ఇదే జరిగింది.


 ఏకంగా టెస్టుల్లో మంచి రికార్డులు ఉన్న ఆటగాడికి కోట్ల రూపాయలు కుమ్మరించి మరి జట్టులోకి తీసుకుంది. తీరా జట్టులోకి వచ్చాక వరుసగా రెండు మ్యాచ్ లలో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఒకరకంగా జట్టు ఓటమికి కారణం అయ్యాడు అని చెప్పాలి. అతను ఎవరో కాదు హ్యారి బ్రూక్స్. ఏకంగా 13.25 కోట్లు పెట్టి పోటీపడి మరి సన్రైజర్స్ అతని జట్టులోకి తెచ్చుకుంది. కానీ మొదటి మ్యాచ్ లో 13 పరుగులు ఇక రెండో మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అతను వికెట్ కోల్పోయాడు. అతన్ని ఎందుకు తీసుకున్నారు రా బాబోయ్ అంటూ ఇక అభిమానులు అతనిని చూసి తల పట్టుకుంటున్నారు.


 నిజానికి హ్యారి బ్రూక్స్ కి టెస్ట్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ గణాంకాలు వన్డే టి20 ఫార్మాట్ లో లేవు. ఇప్పటివరకు 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్స్ 10 ఇన్నింగ్స్ లలో ఏకంగా నాలుగు సెంచరీలు మూడు అర్థ శతకాలు చేశాడు. ఇంగ్లాండ్ తరఫున 20 టీ20 లు ఆడిన బ్రూక్స్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే కావడం గమనార్హం. ఈ విషయం తెలిసి టెస్ట్ క్రికెట్ ఆడే వాడిని తీసుకొచ్చి టి20 లో ఆడిస్తే ఇలాగే ఉంటుంది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో జరిగే మ్యాచ్లలో అయినా  తనకు దక్కిన ధరకు న్యాయం చేస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl