సాదరణంగా ఐపీఎల్ లో ప్రతి జట్టు ఒక సీజన్లో కాకపోయినా మరో సీజన్లో మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. టైటిల్ గెలవకపోయినా కనీసం ఫైనల్ వరకు అయినా వెళుతూ ఉంటుంది. దీంతో టైటిల్ గెలవకపోతేనేం.. మా జట్టు మంచి ప్రదర్శన చేసింది అని అభిమానులు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. కానీ అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు గత కొన్నేల్ల నుంచి కూడా నిరాశ మిగులుతూ వస్తుంది.


 జట్టుకు వరుసగా కెప్టెన్లు మారుతున్న ఆ జట్టుకు పట్టిన దరిద్రం మాత్రం అసలు వీడటం లేదేమో అనేట్లుగా సన్రైజర్స్ ప్రదర్శన కొనసాగుతుంది. గత రెండు మూడు ఐపిఎల్ సీజన్స్ నుంచి కూడా ఒక్కసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అంతేకాదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా షాక్ కి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఈ ఏడాది కూడా కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగింది సన్రైజర్స్ జట్టు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఫ్రాంచైజీకి మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడు ఐడెం మార్కరమ్ .


 ఇంకేముంది అటు ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్ లో కూడా అందరి ద్రాక్షలా ఉన్న టైటిల్ అందించేది అతడే అని నమ్మకాన్ని పెట్టుకుని కెప్టెన్సీ అప్పగించింది. ఇక కెప్టెన్ మారిన తర్వాత సన్రైజర్స్ ఫేట్ కూడా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇటీవలే ఐడెం మార్కరమ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సన్రైజర్స్ మరో ఘోర ఓటమి చవి చూసింది. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాల్సిన ఐడెం మార్కరమ్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో సన్రైజర్స్ ప్రదర్శన పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫ్యాన్స్ కెప్టెన్ మారాడు అంతే ఇంకేం మారలేదు.. అంచనాలు పెట్టుకోవడం మా తప్పే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl