ప్రపంచ క్రికెట్లో డిఆర్ఎస్ అనే ఒక రూల్ ఉంది అన్న విషయం తెలిసిందే. డిఆర్ఎస్ అంటే ఎంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ ఇక అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మరోసారి రివ్యూ చేసి క్షుణ్ణంగా పరిశీలించి.. ఇక తుది నిర్ణయం ఏంటి అన్నది వెల్లడించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాలి. అయితే క్రికెట్ లో ఉండే డిఆర్ఎస్ అనే రూల్ గురించి వినిపించగానే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ధోని రివ్యూ సిస్టం అనే ఫుల్ ఫామ్ గుర్తుకు వస్తూ ఉంటుంది.



 ఇక ఇప్పటికీ కూడా ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ అంటే ఏంటో మాత్రం తెలియదు. అందరూ నిజంగానే ధోని రివ్యూ సిస్టం ఏమో అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే అంతలా తన రివ్యూ లతో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ధోని. ధోని ఒకసారి రివ్యూ తీసుకున్నాడు అంటే అది 99.9% ఇక ధోనికి అనుకూలంగానే రిజల్ట్ వస్తుందని అభిమానులు నమ్ముతూ ఉంటారు. ఇక ధోని రివ్యూ తీసుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు సైతం అవుట్ అని భావిస్తూ చివరికి మైదానాన్ని వీడుతూ ఉంటారు అని చెప్పాలి.


 డిఆర్ఎస్ ను ధోని రివ్యూ సిస్టం అని ఎందుకు అంటారు అన్న విషయం మరోసారి నిరూపించాడు ధోని. ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చాడు సూర్య కుమార్ యాదవ్. అయితే ముంబై ఇన్నింగ్స్ సమయంలో  శాంట్నర్ ఎనిమిదో ఓవర్ వేశాడు. ఆ సమయంలో సూర్యకుమార్ స్వీప్ షాట్ ఆడెందుకు ప్రయత్నించగా.. ధోని చేతుల్లోకి క్యాచ్ వెళ్ళింది. అయితే సూర్యకుమార్ బ్యాట్ కి తగిలినట్లు మాత్రం ఎక్కడ కనిపించలేదు. కానీ ధోని మాత్రం అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ ఎంపైర్ వైడ్ గా ప్రకటించాడు. దీంతో ధోని రివ్యూ కు వెళ్లగా.. అతని గ్లౌస్ కి బంతి తగిలినట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సూర్యకుమార్ను ఔట్ గా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: