చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఎంతో జోరు చూపిస్తుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లోనే అటు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత రెండు మ్యాచ్లలో మాత్రం అద్భుతంగా రానించి విజయం సాధించింది అని చెప్పాలి.  ఇటీవలే ముంబై ఇండియన్స్ పై కూడా ఘనవిజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పలు మార్పులు చేర్పులు జరిగాయి అన్న విషయం తెలిసిందే.



 16 కోట్లకు పైగా ధర పెట్టి కొనుగోలు చేసిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ని ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు పక్కన పెట్టేశారు. ఇక అతని స్థానంలో అజింక్య రహనేను జట్టులోకి తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఎంతో అలవోకగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత చెన్నై యాజమాన్యం కాస్లీ ప్లేయర్ గా ఉన్న బెన్ స్టోక్స్ ను పక్కన పెట్టి మంచి పని చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు బెన్ స్టోక్స్.


 అతనికి అంత ధర పెట్టి చెన్నై యాజమాన్యం తప్పు చేసింది అని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇక మూడో మ్యాచ్లో అతన్ని పక్కకు పెట్టి అతని స్థానంలో అజంక్య రహానే తీసుకుంటే అతను మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 27 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంబాన్ని అందించాడు. ఇక అతని సూపర్ ఇన్నింగ్స్ ముందు అటు ముంబై ఇండియన్స్ విధించిన టార్గెట్ కూడా చిన్నది అయిపోయింది అని చెప్పాలి. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు అంటే అతని ఇన్నింగ్స్ ఎంత వీరోచితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ కాస్లీ ప్లేయర్ ను పక్కకు పెట్టి రహనేని తీసుకొని మంచి పని చేశారు. తదుపరి మ్యాచ్ లలో కూడా రహానేనే కొనసాగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: