రిషబ్ పంత్ కంటే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో అనుభవజ్ఞుడు అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇక గతంలో సన్రైజర్స్ కు కెప్టెన్సీ వహించి ఒకసారి టైటిల్ గెలిపించిన చరిష్మా కూడా ఉంది. దీంతో ఇక రిషబ్ పంతు కంటే మెరుగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ ని డేవిడ్ వార్నర్ ముందుకు నడిపిస్తాడు అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ మునుపేన్నడు లేనంత పేలవ ప్రదర్శన చేస్తుంది. ప్రత్యర్థులకు ఎక్కడ పోటీ ఇవ్వలేక వరుస ఓవటములతో సతమతమవుతుంది. ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా మూడింటిలో ఓడిపోయింది అని చెప్పాలి.
అయితే కెప్టెన్ డేవిడ్ వార్నర్ పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ ఇక ఆ పరుగుల కోసం ఎక్కువ బంతులను వృధా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వార్నర్ ఆట తీరుపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వార్నర్ ఆట తీరును మెరుగుపరుచుకోవాలి వేగంగా పరుగులు చేయకపోతే ఐపీఎల్ ఆడొద్దు అంటూ సూచించాడు. 55 బంతుల్లో 65 పరుగులు చేసే బదులు 30ల్లోనే అవుట్ అయితే బాగుంటుంది. మిగతా ఆటగాళ్లకు హిట్టింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.