విరాట్ కోహ్లీని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతని ఆట తీరుతో ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో అతను ఆ రేంజ్ లో రికార్డులు సృష్టించాడు. ఎంతో మంది దిగ్గజాలు సాధించిన రికార్డులను సైతం అలవోకగా చేదించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే తాను చరిత్ర సృష్టించే క్రికెటర్ ని అన్న విషయం అటు ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు అని చెప్పాలి.


 విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు అటు ప్రత్యర్థి బౌలర్లు అందరూ కూడా వనికి పోతూ ఉంటారు. ఇక తమ కెరియర్ లో ఒక్కసారైనా విరాట్ కోహ్లీ వికెట్ పడగొడితే చాలు ఇక అంతకంటే ఇంకేం వద్దు అన్నట్లుగానే భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతలా ప్రపంచ క్రికెట్లో హవా నడిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. తన అద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికీ తన రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు మూడేళ్ల పాటు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ.. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డాడు.


 మళ్లీ మునుపటి ఫామ్ అందుకుని రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా బెంగళూరు జట్టు తరఫున మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో అటు బెంగళూరు జట్టు ఓడిపోయినప్పటికీ.. కోహ్లీ మాత్రం ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఇటీవల లక్నో జట్టుపై హాఫ్ సెంచరీ చేశాడు కోహ్లీ అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ లో ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్ పై అర్థ సెంచరీలు నమోదు చేసిన ఘనతను దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందుకు కోహ్లీ లక్నో మినహా మిగిలిన 8 ఫ్రాంచైజీ లపై హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో 44 బంతుల్లో నాలుగు బౌండరీలు నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: