టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో స్టార్ ప్లేయర్గా ఎన్నోసార్లు అద్వితీయమైన విజయాలు అందించిన ఆటగాడిగా ఇక భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కోహ్లీని ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా భారత జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడంతో కోహ్లీ మరింత పాపులారిటీ సంపాదించాడు అని చెప్పాలి.



 ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క జంటకు ప్రతిరూపంగా వామిక అనే కూతురు పుట్టింది. ఇక కూతురుని ఎంతో ప్రేమగా చూసుకుంటూనే ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీబిజీగా గడిపేస్తూ ఉన్నారు కోహ్లీ, అనుష్క. అయితే ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ తమ కూతురు వామిక ముఖాన్ని రివిల్ చేయలేదు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే గతంలో ఏకంగా విరాట్ కోహ్లీ కూతురు వామీకను రేప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో కొంతమంది గుర్తు తెలియని నిందితులు వార్నింగులు ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది అని చెప్పాలి.


 ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇలా కోహ్లీ కూతురుని రేప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది ఒక విద్యార్థి అన్న విషయాన్ని కనుక్కున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు విద్యార్థిపై ఉన్న ఎఫ్ఐఆర్ ను ఇటీవల బాంబే కోర్టు రద్దు చేసింది అని చెప్పాలి. ఇక ఇలా విద్యార్థి పై ఉన్న ఎఫ్ఐఆర్ కోర్టు కొట్టి వేయడానికి కారణం కూడా ఉంది. హైదరాబాద్కు చెందిన విద్యార్థి పై ఉన్న ఎఫ్ఐఆర్ ను తొలగించేందుకు కోహ్లీ జంటకు ఎలాంటి అభ్యంతరం లేదని వారి మేనేజర్ అక్వేలియా తెలిపారు. సదరు విద్యార్థి కోహ్లీకి ఒక లేఖ రాశాడని.. అందులో ఎఫ్ఐఆర్ ను రద్దు చేసుకోవాలంటూ కోరాడని.. ఇక కోహ్లీ పెద్ద మనసు చేసుకొని అందుకు అంగీకరించాడని కోహ్లీ మేనేజర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: