
అదే సమయంలో ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న కొంతమంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో కొన్ని అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నారు అని చెప్పాలి. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు బట్లర్. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఇప్పుడు వరకు ఐపీఎల్ లో 86 మ్యాచ్లు ఆడిన బట్లర్ 3035 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు బట్లర్. అదే సమయంలో ఇక ఈ అరుదైన మైలురాణి అందుకున్న 21వ విదేశీ ఆటగాడిగా కూడా రికార్డుసృష్టించాడు. అత్యంత వేగంగా 3000 పరుగులను చేరుకున్న మూడో బ్యాట్స్మెన్ గా నిలిచాడు జాస్ బట్లర్ అని చెప్పాలి. జాస్ బట్లర్ కు 3000 పరుగుల కోసం 85 ఇన్నింగ్స్ లు అవసరమైతే.. క్రిస్కేల్ 75 ఇన్నింగ్స్ లు, రాహుల్ 80 ఇన్నింగ్స్ లలో సాధించారు అని చెప్పాలి.