ఇప్పటికే పృథ్వీషా టీమ్ ఇండియాకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అతను భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి ఏళ్లు గడిచిపోతున్నాయి. అయితే ఐపీఎల్లో అయినా నిరూపించుకొని అతను మళ్ళీ టీమిండియాలోకి వస్తాడు అనుకుంటే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతూ ఘోర వైఫల్యాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా మ్యాచులు జరుగుతున్న కొద్ది తమ ఆటను మెరుగుపరుచుకుంటారు. కానీ పృథ్వి షా విషయంలో మాత్రం మ్యాచ్లు జరుగుతున్న కొద్ది ఆట తీరు మరింత దారుణంగా తయారవుతుంది అని చెప్పాలి.
ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో సైతం పృథ్విషా మరోసారి 13 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అతను ఆడిన ఆరు మ్యాచ్ లలో కలిపి చేసింది కేవలం 47 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఇక అతని అత్యధిక స్కోరు 15 పరుగులు మాత్రమే. దీన్ని బట్టి అతని ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో అందరికీ అర్థమయిపోతుంది. అయితే ఇంత దారుణంగా విఫలమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అతనికి ఇంకా ఎందుకు వరుసగా అవకాశాలు ఇస్తుంది అన్నది మాత్రం ఎవ్వరికి అర్థం కాని ప్రశ్నల మారిపోయింది. ఇప్పటికైనా పృథ్విషాను పక్కనపెట్టి అటు మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ ఓటమిల